వరుణ్ తేజ్ స్పేస్ ఫిల్మ్, టైటిల్ ఆ రోజే

వరుణ్ తేజ్ -అదితిరావ్- లావణ్యత్రిపాఠి కాంబోలో ఓ మూవీ రానుంది. అంతరిక్షం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి కాన్సెప్ట్ పోస్టర్‌ని యూనిట్ రిలీజ్ చేసింది. టైటిల్‌ని ఆగస్టు 15 ఉదయం 9.30కు ప్రకటించనున్నట్లు డైరెక్టర్ సంకల్ప్‌రెడ్డి తెలిపాడు. ఈ చిత్రాన్ని హాలీవుడ్ స్టయిల్‌‌లో యాక్షన్ ఎపిసోడ్స్‌ని జీరో గ్రావిటీలో తెరకెక్కిస్తున్నారు. దీని కోసం వరుణ్ తేజ్‌తోపాటు టీమ్ సభ్యులంతా జీరో గ్రావిటీలో ట్రైనింగ్ తీసుకున్నారు. ఈ ఫిల్మ్‌ని సాయిబాబు జాగర్లమూడి-రాజీవ్ రెడ్డి ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. సత్యదేవ్, శ్రీనివాస్ అవసరాల కీలకపాత్రల్లో నటిస్తున్నారు.

READ ALSO

Related News