నాకు ప్రాణం పోసింది రాజీవ్‌గాంధీయే-వాజ్‌పేయి

బతికున్న రోజుల్లో ఓ విషయాన్ని బయటపెట్టారు మాజీ ప్రధాని వాజ్‌పేయి. తాను ఇప్పటివరకు బతికి ఉన్నానంటే అందుకు కారణం అప్పటి ప్రధాని రాజీవ్‌గాంధీయేనని పలుమార్లు ప్రస్తావించారు అటల్. 1988లో వాజ్‌పేయి మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నారు. ఇందుకు విదేశాల్లో కచ్చితంగా ట్రీట్‌మెంట్ తీసుకోవాల్సిందే! కానీ, ప్రతిపక్ష నేతగా వాజ్‌పేయి బిజీగా వున్నారు. ఈ విషయం ప్రధాని రాజీవ్‌కి తెలిసింది. వెంటనే వాజ్‌పేయిని తన ఆఫీస్‌కి పిలిచి మాట్లాడారు. ఐక్యరాజ్యసమితి సదస్సుకు వెళ్లే బృందంలో మిమ్మల్ని చేర్చుతున్నానని, సదస్సు తర్వాత న్యూయార్క్ వెళ్లి ట్రీట్‌మెంట్ తీసుకోవాలని వాజ్‌పేయికి సూచించారు రాజీవ్‌గాంధీ. అందుకు వాజ్‌పేయి ఓకే చెప్పడంతో అలా కిడ్నీ ఆపరేషన్ చేయించుకున్నారు. ఈ విషయాన్ని అటల్ స్వయంగా సీనియర్ జర్నలిస్ట్ కరణ్ థాపర్‌తో పంచుకోవడం విశేషం. దీనికి సంబంధించిన వీడియోలో చాలా విషయాల గురించి అటల్ మాట్లాడారు.

 

Related News