స్టాక్ మార్కెట్లకు ‘కన్నడ బెడద’

కేంద్ర సర్కారు పటిష్టత మీద ఆధారపడి నడిచే దేశీయ స్టాక్ మార్కెట్లు.. నిన్నటివరకూ తెగ ఉత్కంఠను భరించాయి. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితం.. కేంద్రంలో మోదీ సర్కారు భవిష్యత్తుకి కొలమానంగా భావిస్తున్న తరుణంలో మదుపరులలో విపరీతమైన ఆసక్తి కనిపించింది. అంతిమతీర్పు వెలువడే సమయంలో స్టాక్ మార్కెట్లలో తీవ్ర ఒడిదుడుకులు తప్పవన్న అంచనాల నేపథ్యమది. కట్ చేస్తే.. కన్నడ ఫలితం ట్రెండ్స్ వెలువడుతున్నకొద్దీ.. డొమెస్టిక్ స్టాక్స్ పరుగులు పెట్టడం మొదలైంది. కర్ణాటక ఫలితాలతో స్టాక్‌మార్కెట్లు భారీ లాభాల బాట పట్టేశాయి. బీజేపీ అనుకూల ఫలితాల నేపధ్యంలో సూచీలు సరికొత్త ఎత్తుల్ని తాకే సూచనలు కనిపించాయి. ఆరంభంలోనే సెన్సెక్స్‌ 400 పాయింట్లు ఎగబాకి 35,964 వద్దకు చేరుకుంది. నిఫ్టీది కూడా అదే దారి. బీజేపీ సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసే దశకు చేరుకోవడంతో.. క్లోజింగ్ సమయానికి మార్కెట్లు సరికొత్త పుంతలు తొక్కవచ్చని అందరూ భావించారు. కానీ.. మధ్యాహ్నమయ్యే సరికి సీన్ మొత్తం మారిపోయింది. కర్నాటక ఫలితాలు హంగ్ దిశగా టర్న్ తీసుకోవడంతో స్టాక్ మార్కెట్లు నష్లాల బాట పట్టేశాయి.

READ ALSO

Related News