యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సేఫ్

యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌లో సాంకేతిక సమస్య తలెత్తడంతో పొలాల్లో అత్యవసరంగా ల్యాండయింది. అయితే ఆయన క్షేమంగా ఉన్నారని యూపీ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ తెలిపారు. సహావర్ తాలూకా ఫరౌలీ గ్రామంలో ఇటీవల ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు హత్యకు గురయ్యారు. వారి కుటుంబాన్ని పరామర్శించేందుకు యోగి ఆదిత్యనాథ్ వెళ్ళారు.

ఫరౌలీ గ్రామ సమీపంలోని కస్తూర్బా విద్యాలయం వద్ద హెలిపాడ్ ఏర్పాటు చేయగా.. దానికి కిలోమీటర్ దూరంలో ఉండగానే హెలికాప్టర్‌లో సమస్య తలెత్తడంతో పైలట్ దాన్ని అత్యవసరంగా పొలాల్లో దించేశాడు. అనంతరం ఆదిత్యనాథ్ యధావిధిగా షెడ్యూల్ ప్రకారం తమ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వెళ్ళారు.

 

READ ALSO

Related News