India / Politics
తప్పు చేశానా ? వెల్‌కం.. థ్యాంక్స్

కాంగ్రెస్ అధ్యక్ష పదవిని చేపట్టబోతున్న రాహుల్ గాంధీ.. ప్రధాని మోదీ మీద తన ట్వీట్ల  వర్షాన్ని ఆపలేదు. గుజరాత్ ఎన్నిక వేళ... రోజుకో ప్రశ్న వేస్తూ మోదీ ప్రభుత్వాన్ని ఇరకాటాన పెడుతున్న ఈ యువనేత తాజాగా..నిత్యావసరాల పెరుగుదలపై తను చేసిన ట్వీట్లలో జరిగిన పొరబాటును అంగీకరించారు. (ఈ పొరబాటును ఆ తరువాత తొలగించారు). కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక..ఈ మూడేళ్ళలో వంటగ్యాస్, కూరగాయలు, పెట్రోలు, డీసెల్ వంటివాటి పెరుగుదల మీద ఓ " టేబుల్ " రూపంలో దుయ్యబట్టిన సంగతి తెలిసిందే.

అయితే ఏ వస్తువు ధర ఎంత పెరిగిందో .ఒకటికి రెండు రెట్లు ఎక్కువగా " ఫిగర్ " చూపుతూ ఈ టేబుల్ సాగింది. దీన్ని బీజేపీ నేతలు తప్పు పట్టారు. దీనిపై రాహుల్ మళ్ళీ సెటైర్ వేశారు. బీజేపీ మిత్రులారా ! మీ నరేంద్ర భాయ్ లాగా కాదు నేను.. సామాన్య మానవుడ్ని. ఒక్కోసారి తప్పు చేస్తుంటాను. లైఫ్ ని ఇలాంటివి ఇంట్రెస్టింగ్   చేస్తాయి. ఈ తప్పును ఎత్తి చూపినందుకు థ్యాంక్స్. ఇలాగే నా పొరబాట్లను ఎత్తి చూపండి.. అంటూ.. తాను మరింత మెరుగ్గా వ్యవహరించేందుకు ఈ దిద్దుబాట్లు తోడ్పడతాయన్నారు. 

 

Read Also

 
Related News