టర్కీవిమానం కూలి..

టర్కీకి చెందిన ప్రైవేట్ జెట్ విమానం కూలిపోగా 11 మంది మరణించారు.  టర్కీ బిజినెస్ మన్ బసరన్ కుమార్తె 28 ఏళ్ళ మినా బసరన్ తో బాటు ఆమె ఫ్రెండ్స్ కూడా ఈ ఘోర ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. దుబాయ్ లో జరిగిన బ్యాచిలర్స్ పార్టీకి హాజరై మినా బసరన్ తిరిగి వెళ్తుండగా ఇరాన్ సరిహద్దుల్లో  ఓ పర్వతాన్ని ఢీ కొని మంటల్లో మండుతూ ప్లేన్ కూలిపోయింది.

  ఈ విషయాన్ని  ఇరాన్ అత్యవసర సేవల విభాగం అధికారులు ధృవీకరించారు.. టర్కీలో బసరన్ కు అనేక వ్యాపారాలు ఉన్నాయి. నిర్మాణం, ఫుడ్, ఎనర్జీ, ఫైనాన్స్ ఇలా అనేక వ్యాపారాలను ఆయన నిర్వహిస్తున్నాడు. వీటికి మినా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ గా వ్యవహరిస్తోంది. మరో నెల రోజుల్లో ఈమె వివాహం జరగాల్సి ఉండగా ఈ ఘోరం జరిగింది.

Related News