కేసీఆర్ కేబినెట్‌పై టీఆర్ఎస్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

కేసీఆర్ కేబినెట్‌పై టీఆర్ఎస్ నేత.. మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేనివారు మంత్రివర్గంలో ఉన్నారన్న నాయిని వ్యాఖ్యలు వాస్తవమని ఆయన వ్యాఖ్యానించారు. అది తలచుకుంటేనే కన్నీళ్లొస్తున్నాయని శ్రీనివాస్‌ గౌడ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, కేసీఆర్‌ నిర్ణయం వెనుక బలమైన కారణం ఉంటుందని తన నమ్మకమని చెప్పుకొచ్చారు. ఉద్యోగులు లేనిదే సకలజనుల సమ్మే లేదు.. తెలంగాణలేదని ఆయన అన్నారు. తెలంగాణకోసం పనిచేయనివాళ్లు ఇప్పుడు మాటలు చెబుతున్నారని ఆయన ఆక్రోశం వ్యక్తం చేశారు.

Related News