స్పీడ్ డ్రైవింగ్..32లక్షల ఫైన్

అతివేగం ప్రమాదకరం.. రోడ్లపై వెళ్తున్నప్పుడు చాలా ప్రాంతాల్లో కనిపిస్తున్న క్యాప్షన్. డ్రైవింగ్ చేసేవాళ్లు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం కూడా! కానీ, రోడ్లు అందంగా వున్నాయని స్పీడ్‌గా డ్రైవ్ చేస్తే ఇబ్బందులు తప్పవు. ఒకప్పుడు ఏమోగానీ, ఇప్పుడు చాలా దేశాలు రోడ్లకు ఇరువైపులా కెమెరాలు పెట్టేశాయి. ఇండియా విషయాన్ని కాసేపు పక్కనపెడితే.. ఓ బ్రిటీషర్ మాత్రం వేగంగా కారు నడిపి అడ్డంగా బుక్కయ్యాడు. భారీ మొత్తంలో జరిమానా విధించారు పోలీసులు. ఇంతకీ ఎక్కడ? ఎప్పుడు? ఎవరు? అనే డీటేల్స్‌లోకి వెళ్తే..

బ్రిటన్‌కి చెందిన 25 ఏళ్ల యువకుడు జులై 31న దుబాయ్‌కి వచ్చాడు. సిటీని చూసి తనను తాను మరిచిపోయాడు. ఇలాంటి ప్రాంతాల్లో హాయిగా డ్రైవింగ్ చేయవచ్చని భావించాడు. అనుకున్నట్టుగానే తన ప్లాన్‌ని అమలు చేయడం మొదలుపెట్టారు. లక్ష రూపాయలు చెల్లించి లగ్జరీ లంబోర్గిని కారుని రెండురోజులు అద్దెకు తీసుకున్నాడు. వెంటనే కారెక్కి గంటకు 230 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తూ ట్రాఫిక్ రూల్స్‌ని అధిగమించాడు. కారు అధిక‌ వేగంతో వెళ్తున్న విషయాన్ని గమనించిన ట్రాఫిక్ సిబ్బంది, వెంటనే వాహనాన్ని గుర్తించారు. కారు ఆపి, రూ.32 లక్షల భారీ జరిమానా విధించారు.

ఈ విషయాన్ని బ్రిటన్ ఎంబసీకి తెలియజేశారు దుబాయ్ అధికారులు. గతేడాది దుబాయ్ ప్రభుత్వం కొత్త ట్రాఫిక్ చట్టాన్ని తీసుకొచ్చింది. దీంతో 60 కిలోమీటర్ల కంటే వాహనాలు వేగంగా వెళ్తే.. దాదాపు 40 వేల రూపాయల జరిమానా. ఇదే స్పీడ్‌తో 12 ట్రాఫిక్ పాయింట్స్‌ని ధాటితే కారు సీజ్‌తోపాటు భారీగానే ఫైన్ వేస్తారు. ఈ విషయాలేమీ తెలియక అడ్డంగా బుక్కయ్యాడు.

READ ALSO

Related News