India / Crime
సినిమా ఫక్కీలో బ్యాంకు దోపిడీ, 25 అడుగుల సొరంగం!

నవీముంబైలోని జునీనగర్ లో ఓ బ్యాంకును దోపిడీ దొంగలు చాకచక్యంగా దోచుకున్నారు. బ్యాంకులోకి 25 అడుగుల సొరంగం తవ్వి బ్యాంకు లాకర్లలోని 40 లక్షల విలువైన బంగారు నగలు, నగదు అపహరించుకు పోయారు. బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచ్ లో గత శనివారం అర్ధరాత్రి దాటాక ఈ ఘరానా చోరీ జరిగింది.

సోమవారం ఉదయం బ్యాంకు సిబ్బంది వచ్చి చూసేసరికి బ్యాంకు లాకర్లలో చాలావరకు తెరిచి ఉండడం చూసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సినిమా ఫక్కీలో జరిగిన ఈ దోపిడీకి దొంగలు 5 నెలలుగా ప్లాన్ వేసినట్టు తెలిసింది. వాళ్ళు ఈ బ్యాంకు దగ్గరే ఓ షాపు అద్దెకు తీసుకుని ఎవరికీ అనుమానం కలగకుండా రెక్కీ నిర్వహించి దోపిడీకి పాల్పడినట్టు చెబుతున్నారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

 

 

Read Also

 
Related News