World / General
అరుదైన పాములాంటి షార్క్

పాము లాంటి తల.. పదునైన 300 దంతాలతో చూస్తేనే హడలెత్తిస్తున్న షార్క్ చేపను చూసి శాస్త్రవేత్తలు షాక్ తిన్నారు. పోర్చుగల్ తీరంలోని అట్లాంటిక్ మహా సముద్రం లోతుల్లోకి వెళ్ళిన వీరికి ఈ షార్క్ ఫాసిల్ కనబడింది. ఫ్రిల్ద్ షార్క్ గా వ్యవహరించే ఇవి దాదాపు ఆరడుగుల పొడవు పెరగగలవని అంటున్నారు.

తన దంతాలతో మరో షార్క్ ను చీల్చి తినగలిగే ఇవి సాధారణంగా జపాన్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా దేశాల్లో సముద్ర ప్రాంతాల్లో అతి లోతైన చోట్ల ఉండేవని కనుగొన్నారు. అరుదైన ఈ రకం షార్క్ జాతి చేపలు ఎప్పుడో అంతరించిపోయినా మళ్ళీ వీటి " ఆనవాలు " కనబడడం విశేషం.

 

Read Also

 
Related News