India / General
సెక్స్ ప్రాథమిక హక్కు.. హార్దిక్‌‌కి దళితనేత సపోర్ట్

సెక్స్ అన్నది ప్రాథమిక హక్కని, ఒకరి ప్రైవసీని భంగం చేసేందుకు మరెవరికీ హక్కు లేదని అన్నారు గుజరాత్ లోని ఓ లాయర్ జిగ్నేష్ మెవానీ. ఈ మేరకు ట్వీట్ చేసిన ఆయన.. ఈ విషయంలో హార్దిక్ పటేల్ ఏమీ సిగ్గుపడాల్సిన అవసరం లేదన్నారు. ఈయన దళిత నేత కూడా. సెక్స్ సీడీలో హార్దిక్ పటేల్ అంటూ గుజరాత్ లో కొన్ని ఛానల్స్ ప్రసారం చేసిన సీడీ గురించి ప్రస్తావించిన జిగ్నేష్.. హార్దిక్ కి మద్దతుగా మాట్లాడాడు. హార్దిక్‌లా కనిపించే ఓ యువకుడు ఒక యువతితో హోటల్ రూమ్‌లో కనిపించిన సీడీ ఇది.... సీక్రెట్ కెమేరాతో షూట్ చేశారంటూ ఈసీడీని ప్రసారం చేసిన సంగతి తెలిసిందే. ఇది బీజేపీ డర్టీ ట్రిక్స్ అని హార్దిక్ పటేల్ కొట్టి పారేశాడు.

గుజరాత్ ఎన్నికలు సమీపిస్తుండడంతో తన ప్రతిష్టను దెబ్బ తీయడానికి ఆ పార్టీ ఇలాంటి కుయుక్తులు పన్నుతోందని ఆయన ఆరోపించాడు. అయితే ఈ సెక్స్ సీడీ తో తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని, ఈ విధమైన డర్టీ గేమ్స్ కి తాము పాల్పడబోమని బీజేపీ నేత, కేంద్రమంత్రి మన్‌సుఖ్ మాండవీయ అన్నారు. అది ఫేక్ సెక్స్ సీడీ అని హార్దిక్ ఆరోపిస్తున్నప్పుడు పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయడంలేదని ఆయన ప్రశ్నించారు.

 

 

Read Also

 
Related News