స్వీడన్‌లో మోడీ దిగిన హోటల్ బయట మన తెలుగువారి నిరసన..!!

ప్రధాని నరేంద్రమోదీకి ప్రత్యేక హోదా సెగ ఇతరదేశాలకు వెళ్లినా తప్పట్లేదు. స్వీడన్ పర్యటనకు వెళ్లిన మోదీ బసచేసిన హోటల్ ముందు అక్కడి తెలుగు ప్రజలు నిరసన ప్రదర్శన చేశారు. ఏపీకి జరుగుతోన్న అన్యాయంపై గొంతెత్తారు. ప్లకార్డులు పట్టుకుని మోదీకి తమ నిరసన తెలియచేశారు. అనూహ్యంగా తెలుగువారి నిరసన స్వీడన్ లోనూ ఎదురుకావడం నరేంద్రమోదీకి ఒకింత ఆశ్చర్యం కలిగించినట్టు సమాచారం. భారత్-స్వీడన్ మధ్య ద్వైపాక్షిక సంబంధాల పటిష్టత కోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోమవారం స్వీడన్ చేరుకున్న సంగతి తెలిసిందే. స్వీడన్ ప్రధాని స్వయంగా తన వాహనంలో మోదీని విమానాశ్రయం నుంచి హోటల్‌కు తీసుకెళ్ళారు. భారతదేశ ప్రధాన మంత్రి స్వీడన్‌కు వెళ్ళడం 30 ఏళ్ళ తర్వాత ఇదే మొదటిసారి.

Related News