మారిషస్‌లో తెలుగు స్టూడెంట్ మృతి

మారిషస్‌లో తెలుగు మెడికల్ స్టూడెంట్ సాయి‌మనోజ్ చనిపోయాడు. అక్కడ ఎంబీబీఎస్ ఫస్టియర్ చదువుతున్న సాయి, ఆదివారం తన ఫ్రెండ్స్‌తో కలిసి సముద్రం స్నానం చేసేందుకు వెళ్లాడు. ఈత కొట్టేందుకు నీళ్లలోకి దిగిన మనోజ్, లోతు ఎక్కువగా ఉండటంతో మునిగిపోయాడు. వెంటనే అతడి కాపాడి ఆసుపత్రికి తీసుకెళ్లినప్పటికీ ఫలితం లేకపోయింది.

ట్రీట్‌మెంట్ తీసుకుంటూ చనిపోయినట్లు అతడి క్లోజ్‌ఫ్రెండ్స్ తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. సాయి మనోజ్ సొంతూరు ప్రకాశం జిల్లాలోని అన్నంగి ప్రాంతం. వెంకటస్వామి- రమాదేవిలకు మనోజ్ ఒక్కడే సంతానం. ఒక్క కొడుకు చనిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. మనోజ్ డెడ్‌బాడీని సొంతూరుకి తరలించేందుకు సహకరించాలని మృతుడి తండ్రి.. అధికారులకు విజ్ఞప్తి చేశాడు.

Related News