ఇక ఒడిశా సీఎంతో..

బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు వ్యతిరేకంగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుపై దృష్టి పెట్టిన తెలంగాణా సీఎం కేసీఆర్. ఇక ఒడిశా ముఖ్యమంత్రి నవీన్  పట్నాయక్ తో భేటీ కావాలని నిర్ణయించు కున్నారు. మే మొదటివారంలో వీరి సమావేశం జరగవచ్చునని, జాతీయ స్థాయి కూటమిపై వీరి మధ్య చర్చలు జరగవచ్చునని తెలుస్తోంది.

ఫ్రంట్ ప్రతిపాదనపై కేసీఆర్ మొదట కోల్ కతా వెళ్లి  పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తో భేటీ అయ్యాక.. ఇటీవలే బెంగుళూరు విజిట్ చేసి జనతాదళ్-ఎస్ జాతీయ అధ్యక్షుడు, మాజీ ప్రధాని దేవెగౌడను కూడా కలిశారు. ( ఆ మధ్య ఝార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ కూడా హైదరాబాద్ వచ్చి కేసీఆర్ కు సంఘీభావం తెలిపారు). ఇదిలా ఉండగా.. ఈనెల 27 న జరగనున్న తెరాస ప్లీనరీ కన్నా ముందే కేసీఆర్ ఒడిశా వెళ్ళాలనుకున్నా..తమ రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నందున  మే నెల మొదటివారంలో భువనేశ్వర్ కు రావాలని నవీన్ పట్నాయక్ ఆయనను ఆహ్వానించారు. ఇందుకు కేసీఆర్ అంగీకరించారు.

Related News