టాలీవుడ్‌ హీరోలెక్కడ? తమిళ హీరోలే బెటర్

రాజకీయాలకు.. సినిమాలకు చాలా దగ్గర సంబంధాలున్నాయి. ముఖ్యంగా సౌత్ రాజకీయాల్లో! ఎందుకంటే ఇవాళ నటీనటులే రేపటి నేతలుగా ఎన్నికైన సందర్భాలు చాలానే వున్నాయి. తాజాగా టాలీవుడ్ నటీనటులపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్. జల్లికట్టు విషయంపై తమిళ ప్రజలకు అక్కడి చిత్ర పరిశ్రమ అండగా నిలిచిందని, మరి ఏపీ హోదా విషయంలో టాలీవుడ్‌ స్పందన ఏమైందని ప్రశ్నించారు. పోరాడే చేవ చచ్చిపోయిందా? అని నిలదీశారు. ప్రత్యేక హోదా కోసం పోరాడకుంటే ఏపీ ప్రజలు మిమ్మల్ని వెలివేసేస్తారంటూ హెచ్చరించారు.

ఎవరికైనా అవార్డు రాకపోతే రచ్చరచ్చ చేస్తారని, ఇంటర్వ్యూలపై ఇంటర్వ్యూలు ఇస్తారని, ఇక్కడ మా ఆంధ్ర ప్రజలకు నిధులు రాక ఎన్నో ఇబ్బందులు పడుతున్నా, మీ కళ్లకు కనబడటం లేదా? ఏసీ రూముల్లో కులుకుతూ కూర్చుంటారా? అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. సంస్కారం అడ్డొస్తోందని లేకపోతే ఇంకాస్త కఠినంగా మాట్లాడేవాడినన్నారు. ఇకనైనా ఉద్యమించకపోతే ఐదు కోట్ల ఆంధ్రులు సినీ పరిశ్రమను వెలివేస్తారని హెచ్చరించారు రాజేంద్రప్రసాద్‌.

Related News