‘ముద్దులయాత్ర’పై దుమారం!

ప్రజా సంకల్ప యాత్ర పేరుతో వైసీపీ అధినేత జగన్ చేస్తున్న పాదయాత్ర వెయ్యి కిలోమీటర్ల మైలురాయికి దగ్గరైంది. ప్రస్తుతం సీఎం సొంత జిల్లా చిత్తూరులో సాగుతున్న జగన్ నడక.. వైసీపీ శ్రేణుల్లో ఎంతమేరకు నిస్తేజాన్ని తగ్గిస్తోందో తెలీదు కానీ.. అధికార పార్టీలో ఎంతోకొంత ‘అసహనం’ కలిగిస్తున్న మాట వాస్తవం. పాదయాత్ర వెంబడి జగన్ చేస్తున్న ప్రకటనలు, ఇస్తున్న హామీలపై ఏపీ సర్కారు అడపాదడపా స్పందిస్తోంది కూడా! అయితే.. ఈ పాదయాత్ర లొల్లి ఇక్కడితో ఆగకుండా ఒక్కోసారి ‘అగ్లీ’ టర్న్ తీసుకుంటోంది.

తాజాగా ఏపీ ఆబ్కారీ మంత్రి జవహర్ చేసిన కామెంట్.. వైసీపీ వర్గాల్లో కాక రేపింది. ”అది పాదయాత్ర కాదు ముద్దుల యాత్ర” అంటూ మంత్రి చేసిన వ్యాఖ్యను వైసీపీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. తల్లికి, చెల్లికీ తేడా తెలీనంత అజ్ఞానంతో మాట్లాడుతున్నారంటూ మంత్రి మీద విరుచుకుపడుతున్నారు బీరును హెల్త్‌ డ్రింక్‌గా అభివర్ణించిన మంత్రికి తమ అధినేత జగన్ మీద కామెంట్ చేసే అర్హత లేదంటూ విమర్శలు పడిపోతున్నాయి. చంద్రబాబు నిర్వహిస్తున్న జన్మభూమి కార్యక్రమం తీరుని దుయ్యబడుతున్నారు. లోకేష్ టంగ్ స్లిప్పుల్ని ప్రస్తావిస్తున్నారు. ఈ లెక్కన వ్యక్తిగత విమర్శలకు దిగితే.. అందులోంచి బైటికొచ్చే చాన్సయితే లేదు.

Related News