హోదా.. మీరంతా వస్తే.. మేం సిద్ధమే- తమ్మారెడ్డి

తెలుగు చిత్ర పరిశ్రమపై టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ. సినీ పరిశ్రమపై ఇష్టంవచ్చినట్టు మాట్లాడడం తగదని, ఇన్నిరోజులు సైలెంట్‌గావున్న టీడీపీకి ఇప్పుడు హోదా గుర్తుకొచ్చిందా? అని ప్రశ్నించారు. ప్రత్యేకహోదా కోసం విశాఖ వచ్చిన సినీనటులను అరెస్ట్ చేసింది టీడీపీ ప్రభుత్వం కాదా? అంటూ ప్రశ్నలు సంధించారు.

చాలామంది సినిమావాళ్లు టీడీపీతో కలిసి పనిచేస్తున్నారని, ముందు వాళ్లతో ప్రకటనలు ఇప్పించండి? ఆ తర్వాత మిగతావాళ్లు మాట్లాడాలని అన్నారు. తమిళనాడులో జల్లికట్టుపై అందరూ ఏకతాటిపైకి వచ్చారని, అందుకే సినీ పరిశ్రమ మద్దతు ఇచ్చిందని గుర్తు చేశారు. అందరూ ఏకతాటిపైకి వస్తే ఇక్కడ కూడా సినీ పరిశ్రమ మీతో కలిసి వస్తుందన్నారు.

Related News