మళ్లీ ఫైర్.. రజినీ అప్పుడు ఎందుకు మాట్లాడలేదు

తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్‌పై మరోసారి ఫైర్ అయ్యాడు తమిళ డైరెక్టర్ భారతీ రాజా. కావేరీ ఇష్యూపై రజినీ మాట్లాడిన తీరుని ఆయన దుయ్యబట్టారు. రాష్ట్రమంతా శాంతియుతంగానే నిరసనలు చేపడుతున్నారని, కానీ రజనీకాంత్ వాళ్ల ఆందోళనను తక్కువ చేసి చూపుతున్నారని మండిపడ్డాడు. రజనీకాంత్ బయటివ్యక్తని ఆరోపించిన భారతీరాజా, శ్రీలంక- తమిళులు, న్యూట్రినో ప్రాజెక్ట్‌పై ఎప్పుడూ నోరు విప్పలేదని, కేవలం కావేరీ వివాదంపై ఎందుకు స్పందించారని ప్రశ్నించాడు. రజనీ ఆలోచించి మాట్లాడకపోతే ప్రజలు అతడ్ని ప్రజలు పక్కనబెట్టేస్తారని అన్నారు.

రజనీ రాజకీయాల్లోకి వస్తున్నట్లు వార్తల నేపథ్యంలో భారతీరాజా ఆయనపై విమర్శలు చేసిన విషయం తెలిసిందే! ఇంతకీ రజినీకాంత్ ఏమన్నాడు? కావేరీ జలాల విషయంలో రీసెంట్‌గా తమిళనాడులో ఆందోళనలు జరిగాయి. చెపాక్‌ స్టేడియంలో ఐపీఎల్‌ మ్యాచ్‌ జరగనివ్వమని ప్రజలు హెచ్చరించారు.. ఐనా కొందరు వ్యక్తులు బందోబస్తుకు వచ్చిన పోలీసులపై చేయిచేసుకున్నారు. ఈ వీడియో సోషల్‌మీడియా లో వైరల్‌గా మారడంతో రజనీ స్పందించాడు శాంతియుతంగా కావేరీ సమస్యని పరిష్కరించుకోవాలని, ఇలా ఆందోళనలు చేస్తే దేశానికే ముప్పని అన్న విషయం తెల్సిందే!

Related News