‘సాహో’లో అనుష్క గెస్ట్ అప్పియరెన్స్.. డైరెక్టర్ ఫిదా..!

ప్రభాస్‌ హీరోగా చేస్తున్న మరో టాలీవుడ్ ప్రెస్టీజియస్ మూవీ ‘సాహో’ జెట్ స్పీడ్ తో రెడీ అవుతోంది. ఇప్పుడు హైదరాబాద్ లో జరుగుతున్న షెడ్యూల్ క్లయిమాక్స్ కొచ్చేసింది. తర్వాత ఫారిన్ షెడ్యూల్ ప్లాన్ చేసింది యూనిట్. ఇదిలా ఉంటే.. ‘సాహోలో అనుష్క స్పెషల్ అప్పియరెన్స్’ అంటూ లేటెస్ట్ గా ఒక వార్త హల్చల్ చేస్తోంది. విషయం ఏమిటంటూ ఆరా తీస్తే.. హైదరాబాద్ లో ‘సాహో’ సెట్స్ లోకి వెళ్లి సడన్ సర్ప్రైజ్ ఇచ్చిందట అరుంధతి అనుష్క. ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ తో కాసేపు సరదాగా గడిపి, డైరెక్టర్ సుజీత్‌, నటుడు మురళీశర్మతో కలిసి సెల్ఫీ దిగింది. తన అప్కమింగ్ మూవీ ‘భాగమతి’ పబ్లిసిటీ కోసమే అనుష్క ఇలా యాక్టివ్‌గా తిరుగుతోందని కూడా చెప్పుకున్నారు.

కానీ.. ఆమె వెళ్ళినప్పుడు సెట్స్ మీద ప్రభాస్ లేడని, ఉండివుంటే వీళ్లిద్దరి మీద ఇప్పుడుండే రూమర్లకు మళ్ళీ రెక్కలొచ్చేవని ఫిలిం నగర్ చెవులు కోరుకుంటోంది. ప్రభాస్ కోరిక మేరకు.. ‘సాహో’లో అనుష్క గెస్ట్ అప్పియరెన్స్ ఇస్తోందన్న ఊసు కూడా మరోవైపు నుంచి వినిపిస్తోంది. ఈ విషయం మీద డైరెక్టర్ సుజీత్ సరైన సమయంలో సరైన రీతిలో స్పందింస్తారని తెలుస్తోంది.

Related News