స్పెషల్ సెల్‌తో చెక్ పెడతాం

సినీ పరిశ్ర్రమలో బాధితులు చేసే ఫిర్యాదుల పరిష్కారానికి ఓ ప్రత్యేక విభాగాన్ని (స్పెషల్ సెల్) ఏర్పాటు చేస్తున్నట్టు తెలంగాణా సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ప్రకటించారు. టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ సమస్యను పరిష్కరించాలని కోరుతూ శనివారం తనను కలిసిన సినీ పెద్దలకు ఆయన ఈ మేరకు హామీనిచ్చారు. చలన చిత్ర అభివృద్ది సంస్థలో ఓ ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తామని, బాధితులు ఈ విభాగానికి ఫిర్యాదు చేయవచ్చునని ఆయన చెప్పారు.

చలన చిత్ర అభివృద్ది సంస్థ ద్వారా ఆర్టిస్టులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని నిర్ణయించామని, ఇండస్ట్రీలో కో-ఆర్డినేటర్లు, దళారుల వ్యవస్థ లేకుండా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఇకపై నటులకు మేనేజర్ల ద్వారా నేరుగా బ్యాంకు ఖాతాలకు చెల్లింపులు జరిగేలా చూస్తామని కూడా తలసాని చెప్పారు. ఇక ఇంతటితో ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టాలని తలసాని కోరారు.

READ ALSO

Related News