సామాన్యుడికి గుడ్ న్యూస్

ఆధార్ కార్డు తప్పనిసరి.. మార్చి 31లోగా బ్యాంకింగ్, టెలిఫోన్ సేవలకు ఆధార్ అనుసంధానం తప్పనిసరి అంటూ వస్తున్నప్రకటనలకు సుప్రీంకోర్టు చెక్ చెప్పింది. ఆధార్ అనుసంధానానికి డెడ్ లైన్ ఏమీ లేదంటూ తేల్చి చెప్పింది. ఈ అంశానికి సంబంధించి దాఖలైన పిటిషన్ పై స్పందించిన కోర్టు ఈ మేరకు వ్యాఖ్యలు చేసింది. అయితే, సంక్షేమ పథకాలకు మాత్రం ఆధార్ తప్పనిసరిగా ఉండాలని కూడా కోర్టు వ్యాఖ్యానించింది. ఆధార్ చట్టవిరుద్ధమా, చట్టబద్ధమా అనే విషయం నిర్ధారించే వరకూ ఈ గడువును నిరవధికంగా పొడిగిస్తున్నట్టు సుప్రీంకోర్టు పేర్కొంది.

 

Related News