సునందా పుష్కర్‌ది హత్యే.. చేసిందెవరు?

కేంద్ర మాజీమంత్రి శశిథరూర్‌ భార్య సునందా పుష్కర్‌ మృతి కేసు కొత్త మలుపు తిరిగింది. ఆమె సూసైడ్ చేసుకోలేదని, హత్య చేసినట్టు నేషనల్ మీడియాలో వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. విష ప్రయోగంతో ఆమెని హత్య చేశారని, కేసు దర్యాప్తు చేస్తున్న అధికారులకు ఈ విషయం తెలుసని ‘డీఎన్‌ఏ’ సంచలన వార్తాకథనాన్ని ప్రచురించింది. ఆమె శరీరంపై 15 వరకు గాయాలున్నాయని, ఐతే, చేతిపైవున్న 10వ నంబర్‌ గాయానికి ఇంజెక్షన్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. 12వ నంబర్‌ గాయం వద్ద పంటిగాటు, అల్ర్పాజోలంను ప్రయోగించినట్లు పోస్టుమార్టంలో వున్నట్లు రాసుకొచ్చింది. ఈ విషయాలన్ని అప్పటి సౌత్ ఢిల్లీ రేంజ్‌ జాయింట్‌ పోలీస్‌ కమిషనర్‌‌కు దర్యాప్తు అధికారులు ఓ నివేదిక ఇచ్చిన విషయాన్ని గుర్తుచేసింది.

ఈ రహస్య నివేదిక తమ వద్ద ఉందని పేర్కొంది ఆ పత్రిక. సునందది హత్య అని తెలిసినా పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయకపోవడం గమనార్హం. నాలుగేళ్ల కిందట అంటే జనవరి 17న ఢిల్లీలోని లీలా ప్యాలెస్‌ హోటల్‌లో సునంద పుష్కర్‌ మరణించిన విషయం తెల్సిందే! ఈ లెక్కన సునందని హత్య చేసిందెవరు? మాఫియా వాళ్లా? దగ్గరవాళ్లా? ఆ రోజు హోటల్‌లో ఏం జరిగింది? అక్కడికి ఎవరెవరు వచ్చారు? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Related News