58మందిని పొట్టనపెట్టుకున్న ఆత్మాహుతి బాంబు

కాబూల్‌లో ఉగ్రమూక పేట్రేగిపోయింది. కల్లోలిత అఫ్గానిస్థాన్‌లో ఇస్లామిక్‌ స్టేట్‌(ఐఎస్‌) ఉగ్రవాదులు జరిపిన దాడిలో 58మంది ప్రాణాలు కోల్పోయారు. రాజధాని కాబూల్‌ నడిబొడ్డున ఆదివారం ఈ విధ్వంసకర ఆత్మాహుతి దాడి జరిగింది. మృతుల్లో 8 మంది చిన్నారులు, 22 మంది మహిళలున్నారు. 120 మంది గాయాలపాలయ్యారు. గాయపడ్డవారిలో 17 మంది చిన్నారులు.

షియాలు ఎక్కువగా ఉండే ప్రాంతంలోని ఓటరు నమోదు కేంద్రం బయట ఈ దాడి జరిగింది. దీంతో అక్టోబరు 20న తలపెట్టిన ఎన్నికలపై ఆ క్రమంలో ఉగ్రమూకలు జరిపే దాడులపై సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దాడిని తామే చేపట్టామని అమాక్‌ వార్తా సంస్థ ద్వారా ఐఎస్‌ ప్రకటించింది.

Related News