అర్జున్‌రెడ్డితో కమల్ కూతురు

తెలుగు లేటెస్ట్ ట్రెండ్ సెట్టర్ ‘అర్జున్ రెడ్డి’. టాలీవుడ్ లో ఇది సృష్టించిన సునామీ, రాబట్టుకున్న వసూళ్లు ఒక సంచలనం. యూత్ ఆడియెన్స్ లో ఒక ప్రత్యేకమైన క్రేజ్ సంపాదించుకున్న ‘అర్జున్ రెడ్డి’ ఇప్పుడు తెలుగేతర ప్రాంతాల్లో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ. కోలీవుడ్ లో ‘అర్జున్ రెడ్డి’ రీమేక్ ఇప్పటికే మొదలైపోయింది.

విక్రమ్ కొడుకు ధృవ్ ఈ మూవీతోనే ఇంట్రడ్యూస్ అవుతున్నాడు. బాల డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకి ‘వర్మ’ అనే పేరు ఫిక్స్ అయ్యింది. ఇటీవల ఫస్ట్ లుక్ కూడా విడుదలై బాగా ట్రెండ్ అవుతోంది. అయితే.. తమిళ్ ‘అర్జున్ రెడ్డి’లో హీరోయిన్ మాత్రం ఇప్పటికీ ఖరారు కాలేదు. అడల్ట్ కంటెంట్ అధికంగా వుండడం.. కొత్త మొహాన్ని పరిచయం చేయాల్సి రావడం.. లాంటి కారణాలతో కథానాయికను వెతకడం క్రిటికల్ గా మారినట్లు తెలుస్తోంది. అయితే.. ఆ వెలితి కూడా తీరిపోయిందన్నది కోలీవుడ్ తాజా వార్త.

‘అర్జున్ రెడ్డి’ తెలుగు వెర్షన్ లో శాలినీ పాండే చేసిన ఫిమేల్ లీడ్ రోల్ కోసం గౌతమీ కూతురు సుబ్బలక్ష్మిని ఓకె చేసినట్లు తమిళ సినీ వర్గాల్లో సౌండ్ వస్తోంది. సో.. విక్రమ్ కొడుకు ధృవ్ ని ముద్దులతో ముంచెత్తడానికి గౌతమి కూతురు సుబ్బలక్ష్మి రెడీ అన్న మాట!

గౌతమి తాడిమళ్ల గారాలపట్టి ‘సుబ్బలక్ష్మి భాటియా’ డెబ్యూ మూవీ విషయంలో కమల్ హాసన్ జోక్యం ఎంత? కమల్ వైపు నుంచి ‘అర్జున్ రెడ్డి’కి గ్రీన్ సిగ్నల్ వచ్చిందా? అనే విషయాలు అటుంచితే.. సుబ్బలక్ష్మి కాల్షీట్ల విషయంలోనే ఇప్పటికీ డైరెక్టర్ బాల ఆఫీసు నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన లేదు.

Related News