కరుణ మృతి.. ఐతే ఏంటి?

దేనికైనా సమయం, సందర్భం అనేది ముఖ్యం. చుట్టూ పరిసరాల్ని, పరిణామాల్ని గమనిస్తూ నడుచుకోవడాన్నే విజ్ఞత, విచక్షణ అంటాం! కానీ.. కోలీవుడ్ పెంకి పిల్ల శృతి హాసన్‌కి ఆ సోయి బొత్తిగా లేనట్లుంది. ద్రవిడ అగ్రనేత కరుణానిధి మరణించి తమిళనాడు మొత్తం శోక సంద్రంలో మునిగిపోయింది. అన్ని వర్గాలతో పాటు సినిమా పరిశ్రమ సైతం స్తంభించిపోయింది. స్టార్ హీరో విజయ్ అయితే.. తన సర్కార్ మూవీ షూటింగ్ కూడా అక్కడికక్కడే రద్దు చేసుకుని చెన్నై వచ్చేశారు. కానీ.. సినిమాల్లేక ఖాళీగా వున్న శృతికి మాత్రం బుద్ధి గడ్డి తిన్నట్లుంది.

‘వీళ్ళిద్దరితో వర్క్ చెయ్యడం చాలా సరదాగా వుంది’ అంటూ ఒక అసందర్భమైన ట్వీట్ చేసి చిక్కుల్లో పడిందామె. ఒక ఆల్బమ్ షూట్ కోసం లండన్లో వున్న శృతి.. తమిళనాడులో జరిగే పరిణామాల్ని ఫాలో కాలేదా లేక.. అయితే నాకేంటి అనే తెంపరితనమా? అంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది. ఒకవైపు ట్రోలింగ్ షురూ అవుతున్నా శృతిలో మార్పు లేదు. పెన్సిల్‌తో ఆమె బొమ్మ గీసి పంపిన ఒక అభిమానికి థాంక్స్ చెబుతూ రీట్వీట్ చేసిన శృతి.. తన జోష్‌ని కంటిన్యూ చేసుకుంది తప్ప.. డీఎంకే తాత ఇక లేరన్న బాధను కించిత్ కూడా వ్యక్తం చేయలేదు.

Related News