India / General
రేపిస్ట్ బాబాకు జైల్లో వీవీఐపీ ట్రీట్‌మెంట్

హర్యానాలోని రోహతక్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న రేపిస్ట్ డేరాబాబా రాం రహీం సింగ్‌కి జైల్లో రాచ మర్యాదలు లభిస్తున్నాయట. జైలు అధికారులు అతడికి వీవీఐపీ ట్రీట్‌మెంట్ ఇస్తున్నారని అక్కడి ఖైదీ ఒకరు తెలిపాడు. డేరాబాబాకు ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తున్నారని, స్పెషల్ ఫుడ్ తెప్పిస్తున్నారని ఆ ఖైదీ చెప్పాడు.

రిపబ్లిక్ టీవీతో మాట్లాడిన ఆ ప్రిజనర్.. ఆ రేపిస్ట్ బాబా ఉంటున్న బరాక్‌కి ఇతర ఖైదీలను వెళ్ళ నివ్వడంలేదని, ఆ బాబా తన కుటుంబ సభ్యులను, తన లాయర్‌ను కలుసుకునేందుకు అతనికి రెండు గంటలు సమయమిస్తున్నారని చెప్పాడు. రాం రహీం సింగ్ జైలు పనులు చేస్తుండగా తామెప్పుడూ చూడలేదని అన్నాడు. ఇదంతా చూస్తే డేరాబాబా డబ్బుతో జైలు అధికారులను లొంగదీసుకున్నట్టు కనిపిస్తోందని అంటున్నారు.

 

 

Read Also

 
Related News