సోనియమ్మతో శివప్రసాదమ్మ, ఏం చెప్పినట్టు?

ఏపీకి న్యాయం చేయాలంటూ పార్లమెంటు ఎదుట రకరకాలుగా ఆందోళన చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ నేతలు. పార్లమెంట్ సమావేశాలు మొదలైన ప్రతీసారీ.. వెరైటీ‌గా తనదైన శైలిలో నిరసనను తెలియజేస్తున్నారు. శుక్రవారం కూడా ట్రాన్స్‌‌జెండర్‌ గెటప్‌లో కనిపించారు ఎంపీ శివప్రసాద్. తాను ఎన్ని వేషాలేసినా.. ప్రధాని మోదీ మనసు కరగడం లేనందని, తప్పక పరిస్థితుల్లో ఈ గెటప్ వేయాల్సివచ్చిందన్నారు. ఎంపీల ఆందోళన సమయంలో కాంగ్రెస్ సీనియర్ నేత సోనియాగాంధీ లోక్‌సభ లోకి వెళ్తూ విచిత్ర వేషధారణలతో ఆందోళన చేస్తున్న శివప్రసాద్‌ను అభినందించడం కొసమెరుపు.

READ ALSO

Related News