మీరు సూపరెహె..క్యారీ ఆన్!

ఏపీకి హోదా, విభజన హామీలపై రోజుకో వేషంతో పార్లమెంటు వద్ద నిరసన తెలుపుతున్న టీడీపీ ఎంపీ శివప్రసాద్‌కు అనూహ్యంగా యూపీయే చైర్ పర్సన్ సోనియా గాంధీ నుంచి ప్రశంసలు లభించాయి. పార్లమెంటు వర్షాకాల సమావేశాల చివరి రోజయిన శుక్రవారం శివప్రసాద్ హిజ్రా వేషధారణలో కనిపించారు. రాఫెల్ విమానాల ఒప్పందంపై లోక్ సభలో ప్రతిపక్షాల ఆందోళన అనంతరం సోనియా సభ నుంచి బయటకు వస్తుండగా పార్లమెంటు గేటు నెం.1 వద్ద టీడీపీ ఎంపీల నిరసనను గమనించారు.

శివప్రసాద్ హిజ్రా వేష ధారణలో కనిపించగానే నవ్వాపుకోలేకపోయారు. ఆయన దగ్గరకు వచ్చి.. గుడ్..బాగా చేస్తున్నారు.. మీరు మంచి యాక్టర్. మీ డిమాండ్ల సాధనకు ఇలాగే నిరసన తెలపండి అని సూచించి వెళ్ళిపోయారు. అనంతరం మాట్లాడిన శివప్రసాద్.. ఎన్ని వేషాలు వేస్తున్నా మోడీ మనసు మాత్రం కరగడంలేదని వాపోయారు.అందుకే చివరకు ఈ వేషం వేయాల్సి వచ్చిందన్నారు.

Related News