జిగేల్‌మన్న ఫ్యాషన్ బ్యూటీ

దీపికా, కంగనా, ఐశ్వర్యరాయ్.. ఇప్పుడేమో సోనమ్ కపూర్. ఇదీ.. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఒకరి తర్వాత మరొకరు ఎంట్రీ ఇస్తూ హాలీవుడ్ బ్యూటీలకు సవాల్ విసురుతున్నారు బాలీవుడ్ బ్యూటీలు. వీళ్లని తమతమ కెమెరాల్లో బంధించేందుకు అక్కడి స్టిల్ ఫోటోగ్రాఫర్లు సైతం పోటీపడుతున్నారు. రీసెంట్‌గా మ్యారేజ్ చేసుకున్న సోనమ్ కపూర్ కూడా ఓ రేంజ్‌లో కనిపించింది.

తన అందాలను సరికొత్తగా ప్రజెంట్ చేసింది. రెడ్ కార్పెట్‌పై తన ఫ్యాషన్ డ్రెస్‌ని బయటపెట్టింది. తన కలర్‌కి మ్యాచ్ అయ్యేలా వెరైటీ గౌనులో కనిపించింది. దీంతో అక్కడి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. లూజ్ బన్ హెయిర్ స్టైల్, కను‌రెప్పలపై ఎల్లో కలర్ ఫినిషింగ్.. అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే వుంది. మొత్తానికి ఈ డ్రెస్సులో మరింత హాట్‌గా ఉందనే అంటున్నారు సినీ లవర్స్.

 

READ ALSO

Related News