ఆన్‌లైన్‌లో స్మిత హంగామా

అలనాటి సౌత్ ఐటమ్ బ్యూటీ సిల్క్‌స్మిత జీవిత చరిత్ర మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘డర్టీ పిక్చర్’ ఫిల్మ్ వచ్చినా గ్లామర్ పరంగానే చూపించారనే టాక్ అప్పట్లోనే నడిచింది. ఈమె గురించి అభిమానులకు తెలియాల్సిన చాలా విషయాలు వున్నాయని కుండబద్దలు కొట్టేశారు. ఈ క్రమంలో స్మిత లైఫ్ స్టోరీని వెబ్‌సిరీస్ రూపంలో తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నాడు డైరెక్టర్ పా.రంజిత్. ఆమె జీవితానికి సంబంధించి చాలావిషయాలను చూపించనున్నాడు. తన నిర్మాణసంస్థలో దీన్ని నిర్మించనున్నాడు.

గ్లామర్ ఇండస్ర్టీలోకి స్మిత అడుగుపెట్టినప్పటి నుంచి చనిపోయే వరకు అన్ని అంశాలను కళ్లకు కట్టినట్టు చూపించనున్నాడు. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్‌ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఇందుకు సంబంధించి త్వరలో ప్రకటన వెలువడే అవకాశం ఉంది. సిల్క్‌స్మిత జీవితం ఆధారంగా రూపొందిన ‘ద డర్టీ పిక్చర్’ సినిమా మంచి విజయం సాధించింది. ఇందులో ఆమె పాత్ర పోషించిన విద్యాబాలన్‌, నేషనల్ అవార్డ్ సైతం అందుకున్న విషయం తెల్సిందే!

Related News