బాలకృష్ణ పక్కన ఛాన్స్!

బాలకృష్ణ-వివి వినాయక్ కాంబో మరోసారి రిపీట్ అవుతోందా? అవుననే వార్తలు వెలువడుతున్నాయి. ఈనెల చివరలో ఈ ప్రాజెక్ట్ గ్రాండ్‌గా లాంఛ్ కానున్నట్లు తెలుస్తోంది. బాలకృష్ణ పక్కన హీరోయిన్‌గా శ్రియని ఎంపిక చేసినట్టు సమాచారం. మ్యారేజ్ తర్వాత శ్రియ జాడ కనిపించడం లేదు. ఈమెని వివి వినాయక్ ఫైనల్ చేసినట్లు ఫిల్మ్‌నగర్ వర్గాలు వెల్లడించాయి. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ చిత్రానికి నిర్మాత సి. కల్యాణ్.

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. జూన్‌లో షూటింగ్ స్టార్ట్ చేసి వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయాలన్నది నిర్మాత థాట్. బాలకృష్ణ- శ్రియ జంటగా ఇప్పటివరకు మూడు సినిమాలొచ్చాయి. చెన్నకేశవరెడ్డి, గౌతమిపుత్ర శాతకర్ణి, పైసా వసూల్. ఇక బాలకృష్ణ-వీవీ వినాయక్ కాంబోలో వచ్చిన చెన్నకేశవరెడ్డి పెద్దగా ఆకట్టుకోలేదు. ఈసారైనా హిట్ కొట్టాలనే ఆలోచనలో వీవీవీ వున్నట్లు తెలుస్తోంది.

READ ALSO

Related News