India / Politics
అప్పీల్ చేస్తాం.. లీగల్ గా పోరాడతాం

ఆర్కే నగర్ బై-పోల్ లో తమిళ హీరో విశాల్ నామినేషన్ తిరస్కరించడానికి వెనుక హైడ్రామా నడిచింది. తన నామినేషన్ పత్రాల్లో విశాల్..దీపన్, సుమతి అనే ఇద్దరి సంతకాలను ఫోర్జరీ చేసినట్టు తేలడంతో రిటర్నింగ్ అధికారి వేలుసామి అతని నామినేషన్ తిరస్కరిస్తున్నట్టు ప్రకటించారు. అయితే ఎన్నికల రిటర్నింగ్ అధికారి నిర్ణయాన్ని సవాలు చేస్తూ కోర్టులో అప్పీలు చేయనున్నట్టు విశాల్ సహా అతని తండ్రి జీ.కె.రెడ్డి తెలిపారు. లీగల్ గా తాము పోరాడుతామని ప్రకటించారు.
ప్రజాస్వామ్యం అపహాస్యానికి గురైందని విశాల్ వాపోయాడు. అసలు వివరాల్లోకి వెళ్తే.. నామినేషన్ పత్రాల్లో అభ్యర్థికి మద్దతు ప్రతిపాదిస్తూ ఆ నియోజకవర్గానికి చెందిన 10 మంది ఓటర్లు సంతకాలు చేయాల్సి ఉంటుంది.

ఈ హీరోకు సంబంధించి దీపన్, సుమతి అనే ఇద్దరు ఓటర్లు ఉన్నారు. అయితే ఉన్నట్టుండి వీళ్ళు ప్లేటు ఫిరాయించారు. ఆ సంతకాలు తమవి కావని, ఎవరో ఫోర్జరీ చేశారని రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. దీంతో విశాల్ నామినేషన్ తిరస్కరిస్తున్నట్టు ప్రకటించారు. మొత్తం 10 మంది ఓటర్ల సంతకాల్లో 8 మంది సంతకాలే చెల్లుబాటవుతాయని ఎన్నికల రిటర్నింగ్ అధికారి స్పష్టం చేశారు. దీపన్, సుమతి అనే ఓటర్లలో సుమతి ఆడియో టేపుల వ్యవహారం ఎన్నో మలుపులు తిరిగి చివరకు విశాల్ కు నిరాశను మిగిల్చింది.

ఇక జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ సమర్పించిన నామినేషన్ పత్రాల్లో ఎన్నో కాలమ్ లను భర్తీ చేయకుండా వదిలివేశారని వేలుసామి గుర్తించారు. ముఖ్యంగా ఆస్తులకు సంబంధించిన కాలమ్ లు ఖాళీగా ఉన్నాయని, ఈ పత్రాలు అసంపూర్తిగా ఉండడంతో తిరస్కరిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. అయితే ఇది రాజకీయ కుట్ర అని దీప దుయ్యబట్టారు.

 

 

Read Also

 
Related News