India / General
నేను..థరూర్‌ని..బతికే ఉన్నా !

అలనాటి బాలీవుడ్ నటుడు శశి కపూర్ కన్ను మూస్తే.. కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్‌కి కష్టాలు వచ్చి పడ్డాయి. అభిమానులు సోషల్ మీడియాలో శశి కపూర్‌కు నివాళులు అర్పించే బదులు పొరబాటున శశి థరూర్‌కు అర్పిస్తున్నారట. శశికపూర్ మరణించినట్టు తెలుయగానే ఓ ఇంగ్లీష్ మీడియా కపూర్ బదులు థరూర్ అని పేర్కొందని, దీంతో తన కార్యాలయానికి విపరీతంగా ఫోన్లు వస్తున్నాయని శశి థరూర్ తన ట్విటర్ ద్వారా తెలిపారు.

" ఉదయం నుంచి నా ఆఫీసుకు అదే పనిగా ఫోన్లు వస్తున్నాయి. నేను చనిపోయినట్టు వార్తలు వస్తున్నాయి. కానీ నాకేం బాధ లేదు. కనీసం ఇంతటి బాధా సమయంలోనూ నవ్వు వస్తోంది." అని శశి థరూర్ పేర్కొన్నారు. కాగా..శశి కపూర్ మృతి తననెంతో కలచివేసిందని ఆయన అన్నారు. అటు-థరూర్‌కు సదరు ఇంగ్లీష్ మీడియా క్షమాపణ చెప్పింది. పేరులో జరిగిన ముద్రా రాక్షసానికి చింతిస్తున్నాం..సారీ అని పేర్కొంది.

 

Read Also

 
Related News