ఆ విమానంలో ఏం జరిగింది ?

ఎయిరిండియాకు చెందిన ఓ విమానానికి పెద్ద ప్రమాదమే తప్పింది. ఈ నెల 19 న అమృత్ సర్ నుంచి ఢిల్లీకి బయల్దేరిన బోయింగ్-787 ప్లేన్ భూమికి సుమారు 15 వేల అడుగుల ఎత్తున ఎగురుతుండగా..హఠాత్తుగా కుదుపులకు గురైంది. ఈ ఘటనలో విమానంలోని ఓ విండో పానెల్ విరిగి కింద పడిపోవడంతో .ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ప్లేన్ లో ప్రయాణిస్తున్న దాదాపు 240 మంది భయాందోళనతో బెంబేలెత్తిపోయారు. కొంతసేపటికి విమానం మళ్ళీ సాధారణ స్థితికి వచ్చింది. వాతావరణం సరిగా లేకపోవడమే దీనికి కారణమని తెలిసింది. ఈ ఘటనకు సంబంధించిన 50 సెకండ్ల వీడియో వైరల్ అయింది.

READ ALSO

Related News