శశికళ, 5వేల కోట్లు, 2వేల ఎకరాలు, 80కంపెనీలు..

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అధికార ముసుగులో ఆమె ప్రియసఖి శశికళ భారీగానే అక్రమాస్తులు కూడబెట్టింది. ప్రస్తుతం జైల్లో కటకటాలు లెక్కపెడుతున్న శశికళ, ఆమె ఫ్యామిలీ అక్రమాస్తులు తవ్వేకొద్దీ నిధులు, నిక్షేపాలవలే బయటకొస్తున్నాయి. వెలుగుచూస్తోన్న ఈ ఆస్తుల పరంపర చూసి ఐటీ అధికారులే నివ్వెరపోతున్నారు.

ఇప్పటివరకూ రూ. 4,500 కోట్ల ఆస్తులు, 1800 ఎకరాల భూమి, 80 నకిలీ కంపెనీలు శశికళ అండ్ ఫ్యామిలీ ఖాతాలో వెలుగుచూశాయి. మొత్తం 187 చోట్ల ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. పెద్ద నోట్ల రద్దు సమయంలో రూ. 150 కోట్లతో తమిళనాడులో ఏకంగా 1200 ఎకరాల భూములు కొనుగోలు చేసినట్టు అధికారులు నిర్ధారించారు. అంతేకాదు, శశికళ బ్యాచ్ కు చెందిన 200 బ్యాంక్ అకౌంట్లను సీజ్ చేశారు. అత్యంత కీలకమైన పోయెస్ గార్డెన్ లోని హార్డ్ డిస్క్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో ఇంకెన్ని మర్మాలు దాగున్నాయో చూడాలి.

Related News