సానియామీర్జాకి ప్రమోషన్

భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తల్లి కాబోతోంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తన అభిమానులతో షేర్ చేసుకుంది. తమ జీవితంలోకి ఓ బేబీ రానుందని ట్విట్టర్ ద్వారా రివీల్ చేసింది. అంతేకాదు ఆసక్తికరమైన తాజా ఫొటోని జత చేసింది. సానియా, షోయబ్ మాలిక్‌ల డ్రెస్సుల మధ్యలో మీర్జా-మాలిక్ పేరుతో చిన్న డ్రెస్‌ని జత చేసింది. బేబీ మీర్జా మాలిక్ పేరుతో హ్యాష్ ట్యాగ్ కూడా పెట్టింది.

ఇదిలావుండగా అక్టోబర్‌లో సానియా కన్సీవ్ అయ్యే ఛాన్స్ వుందంటూ ఆమె తండ్రి న్యూస్ ఏజెన్సీకి తెలిపాడు. మరోవైపు సానియా మదర్ కానున్న విషయం తెలియగానే ఆమెకి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. మొన్న ఏప్రిల్ 12న ఎనిమిదవ మ్యారేజ్ యానివర్సరీ జరుపుకున్న ఈ సెలబ్రిటీ కపుల్‌ ఇదే నెలలో మరో శుభవార్తను ఎంజాయ్ చేసింది.

 

Related News