సమంత చిన్నప్పటి సంగతి

చిన్నతనం నుంచి యవ్వనంలోకి అడుగుపెట్టి స్వయం కృషితో వెండితెరమీద తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుని ఎందరి మదినో దోచుకుంది సమంత. అంతేకాదు ఇటీవలే తన మనసుకు నచ్చిన వరుడ్ని కట్టుకుని అక్కినేని వారి కోడలైంది. శిఖరాలకు చేరుకుని ఒకింటిదైన సమంత ఇప్పుడు తన చిన్ననాటి మధుర స్మృతుల్ని నెమరువేసుకుంటుంది. తను చిన్నప్పుడు తరచూ వెళ్లే ప్రాంతాలకు వెళ్లి అప్పటి సంగతుల్ని గుర్తుకు తెచ్చుకుంటుంది. తాజాగా తాను చిన్నప్పుడు వెళ్లిన చర్చిని సందర్శించిన సమంత ఆ చర్చి ముందు ఫొటో దిగి అప్పటి సంగతుల గురించి చెప్పుకొచ్చింది. అమ్మ బలవంతంతో చర్చికి వెళ్లేదాన్నని, అమ్మ ప్రతి బుధ, శని, ఆదివారం చర్చికి తీసుకెళ్లేదని.. అయితే, తనకు, అస్సలు ఇష్టముండేది కాదని.. కానీ, ఆమె ప్రార్థనలే నన్ను రక్షించాయి. మై అమేజింగ్ మమ్. అని సమంత చెప్పుకొచ్చింది.

Related News