AP and TS / Entertainment
సైరా రైటర్స్ వార్..

మెగాస్టార్ 151 వ సినిమా, చారిత్రక సైరా నరసింహారెడ్డి ఎప్పుడు సెట్స్ కు వెళ్తుందనేది ఇంకా సస్పెన్స్ లోనే ఉంది. ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ బాగా ఆలస్యం కావడం పై చిరు కూడా అసహనంగా ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఈ సినిమా రైటర్స్ మధ్య వార్ నడుస్తోందని అందుకు డైరెక్టర్ సురేందర్ రెడ్డి కారణమన్నది మరో మాట.

అసలీ స్క్రిప్ట్ ను పరుచూరి బ్రదర్స్ ఎప్పటినుండో ప్రిపేర్ చేసుకుంటే డెవెలప్ మెంట్ కోసం బుర్రా సాయి మాధవ్ కూడా ఎంటర్ అయ్యాడని పరుచూరి స్క్రీన్ ప్లే లో కొంత సురేందర్ కు నచ్చలేదని సాయిమాధవ్ మరో ఇద్దరు రైటర్స్ ను సురేందర్ ఇన్వాల్వ్ చేయడంతో అసలు కధ అటకెక్కిందంటున్నారు. ఫైనల్ గా ఈ పంచాయితీ ఇప్పుడు చిరు వద్దకు చేరిందని వారం రోజుల్లో అందరూ కల్సి బౌండ్ స్క్రిప్ట్ ఇవ్వాలని ఆర్డర్ వేశాడట చిరు. అటు సైరా కు ఫోటోగ్రఫీ, మ్యూజిక్ లోనూ ఇంకా ఎవరూ ఫైనల్ కాలేదు.

 

Read Also

 
Related News