రెండు కోట్లు ఇస్తామన్నా, నో

ఫిదా బ్యూటీ సాయిపల్లవి గురించి లేటెస్ట్ న్యూస్. టాలీవుడ్‌లో ఓ మూవీ కోసం ఈమెకి రెండు కోట్ల రూపాయల రెమ్యునరేషన్ ఇస్తామన్నా.. నో అన్నట్లు టాక్. మరి ఈ ఆఫర్‌ని ఎందుకు రిజెక్ట్ చేసింది? ఇంతకీ, ఏ హీరో మూవీ? ఇలా డీటేల్స్‌లోకి వెళ్తే.. గ్లామర్ ఇండస్ర్టీ అనగానే.. దీపం వుండగానే నాలుగు రాళ్లు వెనకేసుకునే సామెతని చాలామంది హీరోయిన్స్ ఫాలోఅవుతారు. కానీ, ఈ విషయంలో తన ట్రాకే సెపరేట్ అంటోంది ఈ హీరోయిన్. తక్కువ సినిమాలతో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైంది ఈ సుందరి.

లేటెస్ట్‌గా బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా రానున్న కొత్త ఫిల్మ్‌లో ఈమెకి హీరోయిన్‌గా ఛాన్స్ వస్తే తోసి పుచ్చేసింది. శ్రీనివాస్ పక్కన కాజల్, సమంత లాంటి స్టార్ హీరోయిన్స్ నటించారు. వాళ్ల కంటే ఎక్కువ ఆఫర్ ఇస్తామని ప్రొడ్యూసర్ చెప్పినప్పటికీ, ఆమె రిజక్ట్ చేసినట్టు ఫిల్మ్‌నగర్ సమాచారం. దీంతో బెల్లంకొండ న్యూఫిల్మ్ కోసం మరో హీరోయిన్‌ని ఎంపిక చేశారు. సాయిపల్లవికి ఇవ్వజూపిన రెండు కోట్లను కొత్త హీరోయిన్‌కి ముట్టజెప్పినట్టు తెలుస్తోంది. మరి సాయి రిజెక్ట్ వెనుక లోగుట్టు ఏంటో? ప్రస్తుతం హనురాఘవపూడి డైరెక్షన్‌లో శర్వానంద్ పక్కన ‘పడి పడి లేచె మనసు’ అనే మూవీలో సాయిపల్లవి నటిస్తోంది.

READ ALSO

Related News