కేరళపై ప్రకృతి కన్నెర్ర, మునిగిన శబరిమల ఆలయం

పది రోజులుగా కురుస్తున్న వర్షాలకు కేరళ కకావికలమైంది. కుండపోతగా కురుస్తున్న వర్షాలకు చాలా ప్రాంతాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. ఈ ఆపద నుంచి తమను కాపాడాలంటూ అక్కడి ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఇప్పటివరకు 324 మంది చనిపోయినట్టు ఆ రాష్ర్ట ప్రభుత్వమే స్వయంగా ప్రకటించడంతో.. అక్కడ పరిస్థితి ఏ రేంజ్‌లో వుందో అర్థమవుతోంది.

మరోవైపు పంపానది ఉధృతంగా ప్రవహించడం, వివిధ డామ్‌ల నుంచి గేట్లు ఎత్తివేడంతో అయ్యప్పస్వామి ఆలయ పరిసర ప్రాంతాలు నీట మునిగాయి. దీంతో టెంపుల్‌ని మూసివేశారు. చాలామంది దేవాలయంలో వుండిపోయారు.

మరోవైపు కొచ్చి ఎయిర్‌పోర్టు సముద్రాన్ని తలపిస్తోంది. తొలుత శనివారం మధ్యాహ్నం వరకు విమాన సర్వీసులను నిలిపివేశారు. ఐనా, వరద తగ్గుముఖం పట్టినట్టు కనిపించడం లేదు. ఇటు చాలా ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సహాయక చర్యలకు ఆటంకంగా మారింది.

గత రాత్రి ఢిల్లీ నుంచి ఎయిర్‌ఫోర్స్‌కి చెందిన ప్రత్యేక విమానంలో కేరళకి వెళ్లారు ప్రధాని నరేంద్రమోదీ. రాత్రి అధికారులతో సమావేశమై వరద పరిస్థితి అంచనా వేశారు. శనివారం ఉదయం హెలికాప్టర్‌ ద్వారా  ఏరియల్ సర్వే చేస్తున్నారు.

 

READ ALSO

Related News