హీరో విక్రమ్ ఎంట్రీ అదిరిపోయింది

విక్రమ్ – కీర్తిసురేష్ జంటగా రానున్న మూవీ ‘సామి స్క్వేర్‌’. దీనికి సంబంధించి ఓ మోషన్ పోస్టర్‌ని విడుదల చేసింది యూనిట్. గత చిత్రాల స్టయిల్‌లో డైరెక్టర్ హరి దీన్ని తెరకెక్కిస్తున్నాడు. ఓ మైలురాయి మీద కత్తి పట్టుకుని కూర్చొన్న విగ్రహంలా కనిపించాడు విక్రమ్‌. ఆ తర్వాత తుపాకీ పేలిస్తే.. ఆ బులెట్‌ రాకెట్‌లా దూసుకుపోవడం బాగుంది. సింగమ్ సిరీస్‌ చిత్రాలతో ప్రేక్షకులకు దగ్గరైన హరి.. ఇప్పుడు ‘సామి’పై ఫోకస్ పెట్టాడు. శరవేగంగా చిత్రీకరణ జరుగుతున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక మే26న ‘సామి స్క్వేర్‌’ ట్రైలర్‌ని విడుదల చేసేందుకు సన్నాహాలు మొదలుపెట్టారు.

 

READ ALSO

Related News