రోడ్డుపై గుంత.. బ్రిడ్జిపైనుంచి కిందపడ్డ ఆర్టీసీ బస్

తెలంగాణ రోడ్ల నిర్వహణ తీరు ప్రయాణీకుల ప్రాణాల మీదకి తెస్తోంది. మార్గం మధ్యలో ఏర్పడ్డ గుంటల్ని పూడ్చే నాధులే కరువవ్వడంతో వాహనదారులు ప్రమాదాల పాలవుతున్నారు. ఈ ఉదయం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం రెడ్డిపాలెం వద్ద ఇలాంటి ప్రమాదమే చోటుచేసుకుంది. భద్రాచలం నుంచి విజయవాడకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు, సారపాక-నాగినేనిప్రోలు మార్గంలో వాగు వంతెనపైనుంచి కింద పడిపోయింది. ఉదయం నుంచి కురుస్తోన్న వర్షం కారణంగా రోడ్డుపై ఏర్పడ్డ గుంతను డ్రైవర్ తప్పించేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో అదుపుతప్పి ఒక్కసారిగా బస్ బ్రిడ్జ్ మీదనుంచి కిందకి పడింది. ప్రమాద సమయంలో బస్సులో 45 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో పది మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Related News