India / Crime
కేరళ‌లో ఆరెస్సెస్ కార్యకర్త దారుణ హత్య..ప్రతీకారంతోనే ..

కేరళలో ఆరెస్సెస్ కార్యకర్త పి. ఆనంద్ దారుణ హత్యకు గురయ్యాడు. 23 ఏళ్ళ ఆనంద్ తన బైక్ పై ప్రయాణిస్తుండగా .. కారులో వచ్చిన దుండగులు అతడి బైక్ ను ధీ కొట్టి అతను కింద పడిపోగానే కత్తులతో దాడి చేసి అదే కారులో పారిపోయారు. తీవ్రంగా గాయపడిన ఆనంద్ ఆ తరువాత మరణించాడు. మూడేళ్ళ క్రితం కాసిం అనే వ్యక్తి హత్య కేసులో ఆనంద్ ప్రధాన నిందితుడు. జైలు శిక్ష అనుభవించి  బెయిలుపై ఉన్న ఇతడ్ని ప్రత్యర్థులు హతమార్చారు.

 గురువాయూర్ లో జరిగిన ఈ హత్యపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు.... సీపీఎం కు చెందిన కాసిం తో ఆనంద్ కు పాత కక్షలున్నట్టు భావిస్తున్నామని, అయితే  రాజకీయ కోణంలోనూ దీన్ని చూస్తున్నామని అంటున్నారు.ఇదిలా ఉండగా.. ఆనంద్ హత్యను బీజేపీ చీఫ్ అమిత్ షా తీవ్రంగా ఖండించారు. కేరళలో సీపీఎం కార్యకర్తలు ఆరెస్సెస్ శ్రేణుల మీద దాడులు, హత్యలకు తెగబడుతున్నా..ఆ రాష్ట్రంలో సీఎం పినరాయి ప్రభుత్వం అదుపు చేయలేక పోతోందని విమర్శిస్తూ ఆయన ట్వీట్ చేశారు.  

 

Read Also

 
Related News