ఏటీఎంలలో ఘరానా చోరీ ..13 లక్షలు అపహరణ

హైదరాబాద్ శేరిలింగంపల్లి తారానగర్ ప్రాంతంలో రెండు ఏటీఎంలను దొంగలు దోచుకున్నారు. శుక్రవారం తెల్లవారుజామున మూడున్నర గంటల సమయంలో ఒకే షట్టర్లో  ఐ‌సీ‌ఐ‌సీ‌ఐ బ్యాంకుకు చెందిన మూడు ఏటీఎంలలో రెండింటిని పగులగొట్టి రూ. 13 లక్షల సొమ్మును దోచుకుపోయారు. నలుగురు వ్యక్తుల్లో ఒకడు షట్టర్‌లోకి వెళ్లి అలారం తీగలను కత్తిరించాడు. మరొకడు బయట కాపలా ఉండగా.. మిగిలినవారు లోపల గ్యాస్ కట్టర్ సాయంతో రెండు ఏటీఎంలను పగులగొట్టి నగదు దోచుకున్నారు. సుమారు గంటసేపు ఈ దోపిడీ జరిగినట్టు సీసీ కెమెరాల ఫుటేజీ ద్వారా గుర్తించారు. చందానగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

READ ALSO

Related News