రోజా రెండు చెవుల్లోనూ పూలు

మామకు వెన్నుపోటు పొడిచి.. రాష్ట్రాన్ని ముక్కలు చేసి.. చంద్రబాబు సీఎం పదవి దక్కించుకున్నారని విమర్శించారు వైసీపీ ఎమ్మెల్యే రోజా. వార్డు మెంబర్‌గా కూడా గెలవలేని లోకేష్‌.. అడ్డదారిలో మంత్రి పదవి దక్కించుకున్నారన్నారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌ రాష్ట్రాన్ని భ్రష్టుపట్టిస్తున్నారని, రాష్ట్రంలో ప్రతిభావంతులకు ఉద్యోగాలు దక్కడంలేదని ఆమె ఆరోపించారు. కుప్పం నుంచి కూడా నిరుద్యోగులు వలసవెళ్తున్నారంటే.. సీఎం చంద్రబాబు సిగ్గుతో తలదించుకోవాలని ఆమె అన్నారు. చంద్రబాబు ఇచ్చిన నిరుద్యోగులకు ఉద్యోగుల హామీ ఏమైందంటూ ఆమె చిత్తూరు జిల్లా పుత్తూరులో చెవుల్లో పూలు పెట్టుకుని ధర్నా నిర్వహించారు.

Related News