సిద్ధూకు రిలీఫ్, రూ.1000 ఫైన్

ఎట్టకేలకు మాజీ క్రికెటర్, పంజాబ్ మినిస్టర్ నవజ్యోత్‌సింగ్‌ సిద్ధూకు బిగ్ రిలీఫ్. సిద్ధూపైవున్న 1988 నాటి కేసుని సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఐతే, ఓ వ్యక్తిని గాయపర్చినందుకు ఆయనకు రూ.1000 జరిమానా విధించింది. అసలు కేసు డీటేల్స్‌లోకి వెళ్తే.. 1988 డిసెంబర్ 17న పాటియాలాలోని రోడ్డుపై వాహనాన్ని నిలిపిన విషయంలో గుర్నాం సింగ్‌ అనే వ్యక్తికి- సిద్ధూకు మధ్య చిన్నపాటి ఘర్షణ జరిగింది. కొద్దిరోజుల తర్వాత గుర్నాంసింగ్‌ చనిపోయాడు. దీంతో సిద్ధునే ఆయన్ని కొట్టి చంపారంటూ ఆరోపణలు వెళ్లువెత్తాయి.

ఈ ఆరోపణలను ట్రయల్‌ కోర్టు తోసిపుచ్చింది. పంజాబ్‌, హర్యానా హైకోర్టు మాత్రం సమర్థించింది. ఈ ఘటనను దోషపూరిత హత్యగా పేర్కొంటూ 2006లో సిద్ధూకు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. ఐతే, హైకోర్టు తీర్పుని సవాల్‌ చేస్తూ మరుసటి ఏడాది సుప్రీంకోర్టును ఆశ్రయించారు సిద్ధూ. తాజాగా హైకోర్టు ఇచ్చిన తీర్పుని సుప్రీంకోర్టు కొట్టివేసింది. అయితే గుర్నాంసింగ్‌ను గాయపర్చినందుకు గాను రూ. 1000 జరిమానా విధించింది.

READ ALSO

Related News