బిఎ విమానాలు ఎక్కవద్దు- రిషికపూర్ పిలుపు

బ్రిటీష్ ఎయిర్‌వేస్ సంస్థపై ఆగ్రహం వ్యక్తంచేశాడు బాలీవుడ్ నటుడు రిషికపూర్. దయచేసి భారతీయులు ఆ విమానాలు ఎక్కవద్దని పిలుపునిచ్చారు. జెట్ ఎయిర్‌వేస్ లేదా ఎమిరేట్స్ విమానాల్లో ట్రావెల్ చేయండి.. అందులో గౌరవం దక్కుతుందని ట్విట్టర్‌లో రాసుకొచ్చాడు. అసలేం జరిగింది? బ్రిటీష్ ఎయిర్‌వేస్‌కి చెందిన ఓ విమానం జూలై 23న లండన్ నుంచి బెర్లిన్‌కు బయలుదేరింది. అందులో కేంద్రంలో జాయింట్ సెక్రటరీ హోదావున్న ఏపీ పాఠక్ ఫ్యామిలీ వుంది. ఆయనతోపాటు భార్య, మూడేళ్ల కొడుకు వున్నారు. ఐతే, అధికారి కొడుకు ఏడుస్తుండడంతో ఫ్లయిట్‌లో వున్న సిబ్బంది.. పాఠక్ భార్య, ఆయన కొడుకుని దూషించారు.

అనంతరం జాతి వివక్ష వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు పాఠక్ ఫ్యామిలీతోపాటు ట్రావెల్ చేస్తున్న భారతీయుల్ని ఎయిర్‌పోర్ట్‌లో దించేసి వెళ్లిపోయింది ఆ విమానం. ఈ వ్యవహారంపై పాఠక్ కేంద్ర విమానశాఖ మంత్రి సురేశ్‌ప్రభుకు ఫిర్యాదు చేశారు. మరోవైపు ఈ ఘటనపై బ్రిటిష్ ఎయిర్ వేస్ కూడా విచారణకు ఆదేశించింది. దీనిపై సీరియస్ అయ్యాడు నటుడు రిషికపూర్. తన పట్ల కూడా బ్రిటిష్ ఎయిర్‌వేస్ సిబ్బంది దురుసుగా ప్రవర్తించారని ఆవేదన వ్యక్తంచేశారు.

 

READ ALSO

Related News