కేసీఆర్ ఆదేశాల మేరకే ఇదంతా..

సీఎం కేసీఆర్ ఆదేశాలమేరకే మండలి చైర్మన్ స్వామి గౌడ్ కంటి గాయం పేరిట ఆస్పత్రిలో చేరారని కాంగ్రెస్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అన్నారు. రైతులకు అండగా ఉండేందుకే తాము అసెంబ్లీలో నిరసన తెలిపామని చెప్పిన ఆయన.. హెడ్ ఫోన్స్ ఎవరికి తగిలాయో స్పష్టంగా ఎందుకు చూపడంలేదని ప్రశ్నించారు. కోమటిరెడ్డి వెంకట రెడ్డికి, సంపత్ కు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు.

గవర్నర్ ప్రసంగంలో రైతుల ఆత్మహత్యలు, పంటలకు గిట్టుబాటు ధరల ప్రస్తావన లేకపోవడం బాధాకరమని రేవంత్ విమర్శించారు. అటు-స్వామి గౌడ్ కు హెడ్ ఫోన్స్ తగిలే చాన్సే లేదని మరో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పేర్కొన్నారు. గౌడ్ కు హెడ్ ఫోన్స్ తగిలినట్టు చెబుతున్న ఫుటేజీ ఎందుకు విడుదల చేయడంలేదని ఆయన ప్రశ్నించారు. కన్నుకు చెయ్యి కూడా ఆయన అడ్డు పెట్టుకోలేదని, నేరుగా ఆస్పత్రిలో చేరారని జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇందులోని మతలబు ఏమిటన్నారు.

READ ALSO

Related News