India / Entertainment
'పప్పు' మీద ఎంత హంగామా ? ఇదీ ఓ సమస్యేనా ?

గుజరాత్ ఎన్నికల వేళ.. తమాషా సంగతులు బయట పడుతున్నాయి. ఎన్నికల ప్రచార హోరు ప్రారంభం కాకముందే.. అధికార బీజేపీ.. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని తమ టార్గెట్ చేసుకుని ఎలక్ట్రానిక్ యాడ్ వీడియోలో వ్యంగ్యాస్త్రాలు విసరడం ప్రారంభించింది. ఈ యాడ్ ఏదో వెరైటీగా ఉంది. సోషల్ మీడియాలో రాహుల్ ని జోయల్ గా " పప్పు" అని బీజేపీ శ్రేణులు వ్యవహరిస్తున్న తీరును ఈ యాడ్ లో జోడించారు. అయితే ఈ విషయంలో వాళ్ళ " పప్పులు " ఉడకలేదు.

పప్పు అనే పదాన్ని యాడ్ లో వినియోగించడాన్ని ఈసీ తప్పు పట్టింది. ఇది ఒకరిని కించపరచేదిగా ఉందని., ఈ వర్డ్ ని తొలగించాలని బీజేపీ నేతలను కోరింది. అయితే తమ యాడ్ స్క్రిప్ట్ లో ఎవరినీ ఉద్దేశించి ఎలాంటి పదాలూ లేవని పేర్కొన్న బీజేపీ వర్గాలు..ఏమైనా ఎన్నికల కమిషన్ ఆదేశాలను తాము పాటిస్తామని.. ఈసీ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుంటామని స్పష్టం చేశాయి. చివరికి గుజరాత్ బీజేపీ అధ్యక్షుడు జితూ వఘానీ అయిష్టంగానే స్క్రిప్ట్ లో నుంచి, వీడియో లోంచి ఈ పదాన్ని డిలిట్ చేసేందుకు అంగీకరించారు.

 

Read Also

 
Related News