India / General
రాములమ్మకు రిలీఫ్

సీనియర్ నటి, కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతికి కోర్టులో ఊరట లభించింది. ఆమె తనను ఛీట్ చేసిందంటూ చెన్నైకి చెందిన ఓ హోటల్ అధినేత ఇందర్ చంద్ జైన్ దాఖలు చేసిన పిటిషన్ ని మద్రాస్ హైకోర్టు కొట్టివేసింది. చెన్నై టీ నగర్ లోని ఓ స్థలానికి పవర్ ఆఫ్ అటార్నీ గా ఉన్న విజయశాంతి తనకు దాన్ని అమ్మడానికి ఓ అగ్రిమెంట్ కుదుర్చుకుని రూ. 4.68 కోట్లు తీసుకున్నారని, కానీ ఆ తర్వాత ఇతరులకు దానిని విక్రయించారని ఆయన పేర్కొన్నాడు. పైగా తీసుకున్న సొమ్మును కూడా తనకు తిరిగి ఇవ్వలేదని ఆరోపించాడు. ఈ మేరకు ఐదేళ్ళ క్రితం జార్జి టౌన్ కోర్టులో పిటిషన్ వేశాడాయన.

అయితే సివిల్ వివాదాలకు సంబంధించిన పిటిషన్ ను స్వీకరించలేమని కోర్టు పేర్కొనడంతో..ఆయన మద్రాస్ హైకోర్టును ఆశ్రయించాడు. అప్పుడే ఎగ్మూరు కోర్టులో క్రిమినల్ కేసు వేశాడు. దీన్ని విచారించాల్సిందిగా సెంట్రల్ క్రైం బ్రాంచ్ ను కోర్టు ఆదేశించింది. అయితే ఈ పిటిషన్లను సవాలు చేస్తూ విజయశాంతి హైకోర్టుకెక్కారు. బుధవారం ఈ రెండు పిటిషన్లను విచారించిన కోర్టు తుది తీర్పు ప్రకటించింది. వ్యక్తిగత కక్షలతో పిటిషన్లు వేయరాదని జైన్ మీద ఆగ్రహం వ్యక్తం చేస్తూ..విజయశాంతిపై దాఖలైన పిటిషన్లను కొట్టివేసింది.

 

Read Also

 
Related News